హైదరాబాద్: 28°C
భక్తి

వాడపల్లి వెంకన్న సన్నిధిలో భక్తజనం

AP: కోనసీమ జిల్లాలోని తిరుమల వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణమాసం శనివారం కావడంతో భక్తులు తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో బారులుతీరారు. ఏడు వారాలు.. ఏడు ప్రదక్షిణల నోములతో వాడపల్లి ఆలయ మాడవీధులు కిక్కిరిసిపోయాయి. గోవింద నామస్మరణతో వెంకన్న దివ్యక్షేత్రం మార్మోగుతోంది. ఆలయ అధికారులు భక్తులకు వసతులు కల్పించారు.