హైదరాబాద్: 28°C
భక్తి

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 31 కంపార్టుమెంట్లలో సర్వదర్శనానికి భక్తులు వేచి ఉన్నారు. క్యూలైన్లలో భక్తులకు టీటీడీ అన్ని వసతులు కల్పించింది. నిన్న శ్రీవారిని 71,803 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,685 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.04 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.