హైదరాబాద్: 28°C
భక్తి

శ్రీశైలంలో భక్తుల రద్దీ సాధారణం

AP: శ్రీశైల క్షేత్రంలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 21,060 మంది మల్లన్నను దర్శించుకున్నారు. 11,756 మంది భక్తులు స్వామివారిని సర్వదర్శనం చేసుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అలాగే, శ్రీశైలం డ్యామ్‌కు వరద నీరు నిలిచిపోయింది. ఇన్ ఫ్లో నిల్, ఔట్ ఫ్లో 45,072 క్యూసెక్కులు నమోదైంది. నీటినిల్వ సామర్థ్యం 215.8070 TMCలు కాగా, 153.5060 TMCలు ఉంది.