హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏకశిలా పర్వతం.. విక్రమాదిత్యుని వింత కోట

యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరి కోటను 11వ శతాబ్దంలో పశ్చిమ చాళుక్య రాజు 'త్రిభువనమల్ల విక్రమాదిత్య VI' నిర్మించారు. ఆయన పేరు మీదుగానే మొదట్లో దీనిని 'త్రిభువనగిరి' అని పిలిచేవారు. కాలక్రమంలో అది 'భువనగిరి'గా మారింది. ఇది సుమారు 500 అడుగుల ఎత్తున్న ఒకే ఒక బృహత్తర ఏకశిలా పర్వతం. దీనిపైకి వెళ్లేందుకు నిర్మించిన మార్గం చాలా అద్భుతంగా ఉండి.. సాహసోపేతంగా ఉంటుంది.