హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైభవంగా రాములవారి నిత్య కళ్యాణం

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నిత్య కల్యాణ వేడుక శనివారం వైభవంగా నిర్వహించారు. మిథిలా స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన కళ్యాణ మండపంలో అర్చకులు శాస్త్రోక్తంగా క్రతువును నిర్వహించారు. అనంతరం భక్తులకు అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.