హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కరెంట్ వైర్ తెగిపడి వ్యక్తి మృతి

BPT: మార్టూరు మండలం ఇసుక దర్శి గ్రామంలో శనివారం విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన ఉయ్యూరు రమేష్ (35) తెగిపడిన విద్యుత్ తీగ తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.