అన్నమయ్య: పెద్దమండ్యంలో శ్రావణ శనివారం సందర్భంగా శ్రీ కోదండరామాలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. శ్రావణ శనివారం వైష్ణవారాధనకు అత్యంత విశిష్టమైనదని అర్చకులు మణికంఠ శర్మ తెలిపారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఏటిగడ్డ ఆంజనేయస్వామి ఆలయం వద్ద విశేష పూజలు, అన్నదానంతో పాటు భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
శ్రావణ శనివారం వైష్ణవారాధనకు విశిష్టత


