ELR: నూజివీడు మండలం అన్నవరం గ్రామంలోని జడ్పీ హైస్కూల్‌లో శనివారం తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించారు. గిడుగు రామమూర్తి పంతులు చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. హెచ్‌ఎం విజయకుమారి, తెలుగు ఉపాధ్యాయురాలు మంగలక్ష్మి మాట్లాడుతూ తెలుగు భాష ప్రాచుర్యానికి గిడుగు రామమూర్తి పంతులు చేసిన సేవలు ఆదర్శనీయమని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
తెలుగు భాష ప్రాచుర్యానికి గిడుగు సేవలు


