హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కారు, బైక్ ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు

KDP: సిద్ధవటం మండలం కడప–చెన్నై జాతీయ రహదారిపై కనుమలోపల్లి వద్ద శనివారం కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న హైవే పెట్రోలింగ్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో కడప రిమ్స్‌కు తరలించారు. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.