హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: తుంగభద్ర జలాశయానికి జలకళ

GDWL: తుంగభద్ర జలాశయంలో నీటి నిల్వ 96.42 TMCలకు చేరడంతో జలాశయం కళకళలాడుతోంది. శనివారం ఉదయం 11,574 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. కాలువల ద్వారా 8,905 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నదిలోకి నీటి విడుదల లేదని అధికారులు తెలిపారు. ఆర్డీఎస్‌కు కూడా నీరు చేరుతుండటంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.