సత్యసాయి: నరసంబూది గ్రామంలో రైతు సేవా కేంద్రం భవనం కంప చెట్ల మధ్య అసంపూర్తిగా దర్శనమిస్తోంది. గత ప్రభుత్వంలో నిర్మాణం ఆర్భాటంగా మొదలు పెట్టి సకాలంలో బిల్లులు ఇవ్వకపోవడంతో గుత్తేదారుడు అర్ధాంతరంగా వదిలేశాడు. నిర్మాణ దశలోనే భవనం శిది లమైపోతోంది. ఈ విషయమై డిప్యూటీ ఎంపీడీవో రెడ్డి ప్రకాశ్ మాట్లాడుతూ.. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరలో పనులను పూర్తి చేస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మొదట ఆర్భాటం.. చివరికి అర్ధాంతరం


