హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యువత క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలి: ఎమ్మెల్యే

CTR: యువత క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ సూచించారు. పీసీఆర్ పాఠశాలలో జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకుని శనివారం ధ్యాన్ చంద్ చిత్రపటానికి ఆయన నివాళులర్పించారు. జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. క్రీడాభివృద్ధికి ధ్యాన్ చంద్ చేసిన సేవలను కొనియాడారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని క్రీడలలో రాణించాలని కోరారు.