హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మల్లంకుంట ట్యాంక్‌బండ్‌పై దుర్వాసన.!

NGKL: అచ్చంపేటలోని మల్లంకుంట ట్యాంక్‌బండ్‌పై చెత్త, వ్యర్థాలతో దుర్వాసన వెదజల్లుతోంది. వ్యాపారులు కూరగాయలు, చికెన్ వ్యర్థాలు, కుళ్లిన చెత్తను పడేస్తుండటంతో స్థానికులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు చెత్త పారవేతను అరికట్టి, ట్యాంక్‌బండ్‌ను శుభ్రపరిచి, పెరిగిన చెట్లను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.