WGL: దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ శ్రీవాస్తవ శనివారం వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న జీఎంకు అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా ఆలయ అధికారులు, సిబ్బంది ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.
తెలంగాణ
VIDEO: అమ్మవారి ఆశీస్సులు పొందిన దక్షిణ మధ్య రైల్వే జీఎం


