హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీచుపల్లి వద్ద డీసీఎం–కారు ఢీ

GDL: జాతీయ రహదారి 44 బీచుపల్లి సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు యూటర్‌ను తీసుకుంటున్న క్రమంలో కర్నూల్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న డీసీఎం వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఘటనలో డీసీఎం డ్రైవర్‌కు స్వల్పగాయాలు కాగా, వాహనం ముందుభాగం కొంతమేర ధ్వంసం అయ్యింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.