హైదరాబాద్: 28°C
తెలంగాణ

గురు పురస్కార గ్రహీతకు ఘన సన్మానం

HNK: కమలాపూర్ మండలం నేరెళ్లకు చెందిన అయ్యప్ప గురుస్వామి, గురు పురస్కార గ్రహీత ఇందుర్తి జానకిరామయ్య శర్మ దంపతులను గ్రామపంచాయతీ పాలకమండలి ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సన్మానించారు. గత 38 ఏళ్లుగా అయ్యప్ప స్వామి సేవలో విశిష్ట సేవలందిస్తున్న జానకిరామయ్య శర్మ ఇటీవల హైదరాబాద్ త్యాగరాయ గానసభలో మహాశాస్త్ర సేవా సంఘం ఆధ్వర్యంలో ‘గురు పురస్కారం–2026’ అందుకున్నారు.