హైదరాబాద్: 28°C
తెలంగాణ

మేళ్లచెరువులో జాతీయ క్రీడా దినోత్సవం

SRPT: మేళ్లచెరువు మండల కేంద్రంలోని రేవూరు రోడ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఐరా రియాల్టీ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎస్సై నవీన్ కుమార్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి, మేజర్ ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. యువత ధ్యాన్‌చంద్‌ను ఆదర్శంగా తీసుకుని క్రీడల్లో రాణించాలని సూచించారు.