TPT: భారత క్రికెటర్ వాషింగ్టన్ సుందర్ సన్నిహితులతో కలిసి శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ముందుగా వీరికి వైకుంఠం వద్ద టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీవారిని దర్శించుకున్న భారత క్రికెటర్


