హైదరాబాద్: 28°C
తెలంగాణ

భైంసాలో పోలీస్ సిబ్బంది ప్రత్యేక పరేడ్..!

NRML: భైంసా సబ్‌డివిజన్ పరిధిలోని పోలీస్ సిబ్బందికి శనివారం భైంసా టౌన్ పోలీస్ స్టేషన్‌లో ప్రత్యేక పరేడ్ నిర్వహించారు. సీఐ రవీందర్ పరేడ్‌ను నిర్వహించి సిబ్బంది ప్రదర్శించిన డ్రిల్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందిలో క్రమశిక్షణ, శారీరక దృఢత్వం, సమన్వయం పెంపొందించేందుకు వీక్లీ పరేడ్‌ ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు.