ADB: ప్రజలు అత్యవసర సమయాల్లో ఉంటే వెంటనే డయల్ 100ను సంప్రదించాలని పోలీస్ సిబ్బంది రమేష్, గోకుల్ సూచించారు. శనివారం నార్నూర్ మండల కేంద్రంలో ఎస్సై శ్రీసాయి ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించారు. సైబర్ నేరాలకు అప్రమత్తంగా ఉండాలని, సైబర్ ఫ్రాడ్ జరిగితే 1930కి ఫిర్యాదు చేయాలన్నారు. యువత గంజాయి, మత్తు పదార్థాలు దూరంగా ఉండాలని వారు పేర్కొన్నారు.
తెలంగాణ
'అత్యవసరానికి డయల్ 100 చేయాలి'


