KMM: వేంసూరు మండల నూతన ఎస్సైగా పి. ప్రదీప్ శనివారం బాధ్యతలు చేపట్టారు. ఇదివరకు సత్తుపల్లి పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేసిన ఆయన బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తూ నేరాల అదుపునకు కృషి చేస్తానన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సైకి స్టేషన్ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
వేంసూరు మండల ఎస్సైగా ప్రదీప్ బాధ్యతలు స్వీకరణ


