హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మధురవాడలో ఎక్సైజ్ అధికారుల తనిఖీలు

VSP: మధురవాడ పెందుర్తి ఎక్సైజ్ సీఐ సరోజా దేవి పర్యవేక్షణలో, సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిబ్బంది శనివారం మధురవాడ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. అనధికారికంగా మద్యం అమ్మకాలు జరిపినా, కల్లు షాపులు నడిపినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్‌సీజన్ ప్రమాదకర కల్లు అమ్ముతున్నారనే అనుమానంతో అమరావతి కాలనీ కె-1, కె-2, వైఎస్సార్ నగర్ లలో శోదాలు చేశారు.