W.G: పెనుమంట్ర మండలం కొయ్యేటిపాడులో శనివారం సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా వ్యవసాయ సిబ్బంది రైతులకు ఎలుకల మందును పంపిణీ చేశారు. పంట పొలాల్లోని ఎలుకల బొరియల్లో మందును పొట్లాల రూపంలో ఉంచాలని సూచించారు. పంట నష్టాన్ని అరికట్టేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో కూటమి నేతలు, రైతులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పంట నష్టాన్ని అరికట్టేందుకు చర్యలు


