హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉంగరం తాకట్టు.. మనస్థాపంతో ఇద్దరి మృతి

కోనసీమ: చించినాడ వంతెన పైనుంచి గోదావరిలోకి దూకిన దంపతుల వ్యవహారంలో కీలక వివరాలు వెల్లడవుతున్నాయి. ఉంగరం తాకట్టు విషయంలో ఓ వ్యక్తి తీవ్ర ఒత్తిడి చేయడంతో మనస్తాపం చెందిన సాయికృష్ణ, భార్య శిరీషతో కలిసి బలవన్మరణానికి యత్నించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని అతడి తల్లిదండ్రులు ధ్రువీకరించగా, ఆత్మహత్యకు ముందు సాయికృష్ణ మాట్లాడిన ఆడియో రికార్డు కీలకం అన్నారు.