హైదరాబాద్: 28°C
తెలంగాణ

నీటి గుంటలో పడి వృద్ధుడి మృతి

MDK: రామాయంపేట పురపాలక పరిధిలోని ఆర్.వెంకటాపూర్‌కు చెందిన సింగరాయపల్లె నరసయ్య శనివారం స్థానిక వెంచర్ నీటి గుంటలో మృతి చెంది కనిపించాడు. కూలి పని చేసుకునే ఆయన శవమై తేలడంతో స్థానికులు పోలీసులకు వర్తమానమిచ్చారు. ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు, మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు.