BDK: పినపాక మండలం జింకలగూడెం గ్రామంలో ఈ నెలలో కారుతో ఢీకొట్టి హత్యాయత్నానికి గురైన షేక్ మౌలానా చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి నిందితుడు షేక్ ఇస్మాయిల్‌ను రిమాండ్‌కు తరలించారు. మౌలానా మృతితో కేసు హత్య కేసుగా మారే అవకాశం ఉంది. ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి!


