హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ స్తంభానికి పిచ్చిమొక్కలు..!

RR: నందిగామ, కొత్తూరు మండలాల శివారు పాత జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభానికి పిచ్చిమొక్కల తీగలు అల్లుకున్నాయి. ఆ పిచ్చి మొక్కలు తినడానికి వస్తే పశువులు విద్యుత్ షాక్ గురయ్యే ప్రమాదం ఉందని వాహనాదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం అటుగా రాకపోకలు సాగించే అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరారు.