BDK: పినపాక మండలం ఈ బయ్యారం క్రాస్‌రోడ్‌లో పోలీస్ అవుట్‌పోస్ట్ వెనుక డ్రైనేజీలో నీరు ప్రవహించక దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో దోమలు పెరిగి పోలీసులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీని అధికారులు వెంటనే శుభ్రం చేయాలని శనివారం స్థానికులు కోరారు. నిర్లక్ష్యం చేస్తే సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ
VIDEO: ఈ బయ్యారం క్రాస్‌రోడ్‌లో డ్రైనేజీ సమస్య


