హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నూజెండ్లలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

PLD: నూజెండ్ల మండలం గుర్రప్ప నాయుడుపాలెం సమీపంలోని ఆర్‌అండ్‌బీ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నూజెండ్ల గ్రామానికి చెందిన పులిగుజ్జు వెంకట్రావు(35) మృతి చెందాడు. మరో ద్విచక్ర వాహనంపై ఉన్న దర్శికి చెందిన భార్యాభర్తలకు గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.