హైదరాబాద్: 28°C
తెలంగాణ

వ్యవసాయంలో వ్యాపార దృక్పథం అవసరం

JN: జఫర్‌గఢ్ మండలం హిమ్మత్నగర్‌లో రైతు ఉత్పత్తిదారుల సంఘం సమావేశం శనివారం నిర్వహించారు. నాబార్డ్ ఏజీఎం విజయకుమార్ మాట్లాడుతూ రైతులు పంటలను ప్రాసెస్ చేసి విక్రయించడం ద్వారా అధిక ఆదాయం పొందవచ్చని తెలిపారు. కేవలం సాగుకే పరిమితం కాకుండా వ్యాపార దృక్పథంతో వ్యవసాయం చేయాలని సూచించారు. కార్యక్రమంలో సీఈఓ టీ. రంజిత, సభ్యులు ఎర్ర సతీష్, తదితరులు పాల్గొన్నారు.