హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఉదయగిరిలో కుక్కలు స్వైర విహారం

NLR: ఉదయగిరి పట్టణంలో కుక్కలు స్వైర విహారం చేస్తూ.. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. పంచాయితీ అధికారులు ఇటీవల కుక్కలు, కోతులను పట్టుకొని ఇతర ప్రాంతాలకు తరలించామని చెబుతున్నప్పటికీ పట్టణంలో ఇంకా వాటి సంచారం కనిపిస్తూనే ఉన్నది. రోడ్లపై గుంపులుగా తిరుగుతున్న కుక్కలతో చిన్నారులు, వృద్ధులు బయటకు రావాలంటే భయపడుతున్నారని వాపోతున్నారు.