NRPT: కొత్తపల్లి(M) భూనీడులో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు శనివారం ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు స్వామివారి జల్ది బిందె ఊరేగింపు, అభిషేకం నిర్వహించనున్నారు. ఆదివారం తెల్లవారుజామున రథోత్సవం, పల్లకి సేవ, మంగళహారతి కార్యక్రమాలు ఉంటాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు.
తెలంగాణ
నేడు భూనీడు ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు


