ASR: జిల్లాలోని మాకవరపాలెం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఆదివారం జిల్లాస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలు నిర్వహించనున్నట్లు కార్యనిర్వాహక కార్యదర్శి డి.రవి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఈ పోటీల్లో పాల్గొనడానికి 2012 తరువాత పుట్టిన వారందరూ అర్హులన్నారు. ఉదయం 9 గంటల నుంచి సబ్ జూనియర్స్ ఎంపిక పోటీలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు సాఫ్ట్ బాల్ పోటీలు


