NRML: తానూర్ మండలం తొండాల గ్రామానికి చెందిన రైతు దానేకర్ సాయబు (45) పాము కాటుతో మృతిచెందారు. కుటుంబ సభ్యులు, గ్రామస్థుల వివరాల ప్రకారం.. గురువారం మధ్యాహ్నం వ్యవసాయ క్షేత్రంలో సోయాబీన్ పంటకు పురుగు మందు పిచికారీ చేస్తుండగా పాము కాటేసింది. దీంతో నిజామాబాద్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందారు.
తెలంగాణ
పాము కాటుతో రైతు మృతి


