హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అప్పులు చెల్లించలేక షాప్‌ యజమాని పరార్‌

KDP: జిల్లాలోని లక్ష్మీ టవర్స్‌ ఎదురుగా ‘సెవంత్‌ సెవన్‌’ హెయిర్‌ కటింగ్‌ షాప్‌ నిర్వహిస్తున్న సంపత్‌కుమార్‌ అప్పులు, సిబ్బంది జీతాలు చెల్లించలేక పరారైనట్లు సమాచారం. మూడు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో బాధితులు షాపు వద్దకు చేరుకుని సామగ్రిని తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. గురువారం రాత్రి ఓ యువతితో కలిసి సంపత్‌కుమార్‌ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.