హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయ స్థాయికి మంగనూరు యువ అథ్లెట్‌

NGKL: మంగనూరుకు చెందిన కాశిరెడ్డి అభినవ్‌ రెడ్డి పరుగు పందెంలో ప్రతిభ చాటుతున్నాడు. కోచ్ మల్లేశ్‌ మార్గదర్శకత్వంలో శిక్షణ పొందుతున్న అభినవ్‌ రాష్ట్రస్థాయి పోటీల్లో 100, 200, 600 మీటర్ల విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించాడు. జాతీయ స్థాయికి ఎదిగిన అభినవ్‌ను క్రీడా దినోత్సవం సందర్భంగా గ్రామస్థులు అభినందించారు.