హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర ప్రమాదం.. నుజ్జునుజ్జయిన కారు

ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవేపై వేంసూరు మండలం సమీపంలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ తగలడంతో కారు ధ్వంసమై నుజ్జునుజ్జు అయింది. సంఘటనా స్థలంలో వాహన భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రమాదంలో ఒకరికి గాయాలవగా సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదాలు జరుగుతుండటంపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.