HNK: ఎల్కతుర్తి మండలంలోని సూరారం గ్రామంలో శనివారం ‘పల్లె పల్లెకు పొన్నం అన్న.. పల్లె పల్లెలో ప్రజా పాలన’ కార్యక్రమాన్ని శనివారం మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అధికారులతో కలిసి గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.
తెలంగాణ
పల్లెకు చేరిన మంత్రి.. సమస్యలపై ఆరా


