కృష్ణా: గుడివాడలో చిట్టీల పేరుతో మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని అనుచరుడు శ్రీనివాసరావు, ఆయన భార్య, కుమారుడు రేవంత్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. శ్రీనివాసరావు ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న శ్రీనివాసరావు కోసం గాలిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
చిట్టీల పేరుతో ఘరానా మోసం


