హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తప్పిన పెను ప్రమాదం.. మహిళలకు గాయాలు

ELR: జంగారెడ్డిగూడెంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఉప్పలమెట్ట ప్రాంతం నుంచి మహిళలు ఆటోలో నర్సరీ పనికి వెళ్తుండగా బైపాస్‌ రోడ్డులో ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను చికిత్స కోసం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మహిళలకు స్వల్ప గాయాలు కావడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు.