హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక శోభ

వరంగల్ నగరంలోని మట్టెవాడ బట్టల బజార్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం శ్రావణ మాసం సందర్భంగా శనివారం భక్తులతో కిటకిటలాడింది. శనివారం స్వామివారికి ప్రీతికరమైన రోజుగా భావించడంతో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.