KDP: సిద్ధవటం మండలం వంతాటిపల్లి ఎస్సీ కాలనీ వద్ద పేరుకుపోయిన మురుగునీటిపై HIT TV NEWSలో వచ్చిన కథనానికి పంచాయతీ సిబ్బంది స్పందించారు. కాలువల్లో పేరుకుపోయిన పూడికను తొలగించి, నిలిచిన మురుగునీటిని బయటకు పంపించారు. దీంతో దుర్గంధం, మురుగు సమస్య నుంచి కాలనీ వాసులకు కొంత ఉపశమనం లభించింది. సమస్యపై స్పందించిన సిబ్బందికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
HIT TV NEWS కథనానికి స్పందన


