హైదరాబాద్: 28°C
తెలంగాణ

దొంగ బంగారం కొంటే కేసులు నమోదు: డీసీపీ

MNCL: దొంగ బంగారం కొనుగోలు చేసిన వ్యాపారులపై కేసులు నమోదు చేసి కఠినచర్యలు తీసుకుంటామని మంచిర్యాల DCP భాస్కర్ ప్రకటనలో హెచ్చరించారు. చోరీలకు పాల్పడినవారు దోచుకున్న బంగారం ఎక్కడో ఒకచోట తక్కువ ధరకు విక్రయించి నగదు తీసుకుంటారు. జ్యుయెలరీ షాపుల యజమానులు తక్కువ ధరకు బంగారం విక్రయించేందుకు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి సహకరించాలని సూచించారు.