హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పశువుల యజమానికి జరిమానా విధిస్తాం'

ASF: బెజ్జూర్ మండల కేంద్రంలో పంట పొలాలను ధ్వంసం చేస్తున్న పశువులను పంచాయతీ సిబ్బంది బంజరు దొడ్డికి తరలించారు. తొలిసారి పంటను నష్టపరిచిన పశువుల యజమానికి రూ. 500, రెండోసారి రూ. 1,000 జరిమానా విధిస్తామని కార్యదర్శి మీసారి వైకుంఠం ప్రకటనలో తెలిపారు. నిర్ణీత గడువులో యజమానులు పశువులను తీసుకెళ్లకపోతే బహిరంగ వేలం వేస్తామని వెల్లడించారు.