హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిరుద్యోగ యువతకు ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణ

ATP: జిల్లాలో ఎస్సీ నిరుద్యోగ యువతకు ఉపాధి కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కుముద శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఎస్సీ మహిళలకు ఇజ్రాయిల్‌లో నర్సింగ్ ఉద్యోగ కల్పనకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు. అర్హత ఆసక్తిగల ఎస్సీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు జిల్లా కార్యాలయానికి సంప్రదించవచ్చని తెలిపారు.