హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జనసేన సమావేశంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు

ATP: మంగళగిరిలో జనసేన పార్టీ రాష్ట్రస్థాయి ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షుడు, అహుడా చైర్మన్ టీ.సీ.వరుణ్ హాజరయ్యారు. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆయనకు కండువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై నాయకులు, కార్యకర్తలతో విస్తృతంగా చర్చించారు.