NDL: శ్రీశైలంలో శుక్రవారం సాధారణ భక్తుల రద్దీ నెలకొంది. ఉదయం 4.30 గంటల నుంచి రాత్రి 11.50 గంటల వరకు 21,060 మంది భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. ఉచిత క్యూలైన్ ద్వారా 11,756 మంది దర్శనం చేసుకున్నారు. 4,877 మంది అన్నప్రసాదాలు స్వీకరించగా, వివిధ ప్రాంతాల నుంచి 1,060 వాహనాల్లో భక్తులు శ్రీశైలానికి చేరుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీశైలంలో భక్తుల రద్దీ!


