SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ తో కలిసి భీమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు మంత్రికి, విప్ కు ఘన స్వాగతం పలికారు. వేద పండితులు వేదొక్త ఆశీర్వచన నిర్వహించారు.
తెలంగాణ
VIDEO: భీమేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి


