హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రోడ్డుపై భారీ గుంతలు.. ప్రయాణికుల అవస్థలు

NLR: రాపూరు గూడూరు ప్రధాన రహదారి అధ్వానంగా తయారయింది. రోడ్డుపై ఏర్పడిన భారీ గుంతలు చిన్నపాటి బావులను తలపిస్తున్నాయి. వర్షం పడితే గుంతల్లో నీరు చేరి ప్రమాదకరంగా మారుతున్నాయి. ముఖ్యంగా రాత్రివేళ ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరుతున్నారు.