హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో డెలివరీ బాయ్ మృతి

RR: నార్సింగి బ్రిడ్జిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో సయ్యద్ సమద్ మృతి చెందాడు. ఫస్ట్ క్లబ్ గ్రోసరీ స్టోర్‌లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న సమద్ హోండా షైన్ బైక్‌పై నార్సింగి నుంచి గండిపేట వైపు వెళ్తుండగా డివైడర్‌పై ఉన్న చెట్టు కుండీని ఢీకొన్నాడు. అనంతరం టాటా ఈవీ ఢీకొట్టడంతో గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.